Rai Lakshmi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • రాయ్ లక్ష్మి ద్విపాత్రాభినయం 
  • 'రీసౌండ్' చేస్తున్న సాయిరాం శంకర్ 
  • హిందీ సినిమాలో నర్రా శీను

   *  గ్లామర్ తార రాయ్ లక్ష్మి ద్విపాత్రాభినయం చేసిన తమిళ చిత్రం 'సిండ్రెల్లా'. విను వెంకటేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి అదే పేరుతో అనువదిస్తున్నారు.
*  పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ మరో చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. కృష్ణ చిరుమామిళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పేరు 'రీసౌండ్'. రాశి సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొదలైంది.  
*  తెలుగులో పలు సినిమాలలో నటిస్తున్న కారెక్టర్ యాక్టర్ నర్రా శీను తొలిసారిగా ఓ హిందీ చిత్రంలో నటిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'రాధే' చిత్రంలో శీను ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. శీను తమిళంలో నటించిన 'ఖాకి' చిత్రంలోని నటనను చూసిన ప్రభుదేవా ఇప్పుడు 'రాధే' చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడట. 

Rai Lakshmi
Puri Jagannath
Sairam Shankar
Salman Khan
Narra Sheenu
  • Loading...

More Telugu News