warangal: వరంగల్‌లో బీటెక్ విద్యార్థిని అదృశ్యం.. మూడు రోజులుగా గాలింపు

  • హన్మకొండలోని వాగ్దేవి కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్థిని
  • మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన వైనం
  • ఏటీఎం నుంచి రూ. 25 వేలు డ్రా

మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బీటెక్ విద్యార్థిని మళ్లీ తిరిగి ఇంటికి రాకపోవడం కలకలం రేపుతోంది. వరంగల్‌లో జరిగిందీ ఘటన. హన్మకొండలోని వాగ్దేవి కళాశాలలో బీటెక్ సెకెండియర్ చదువుతున్న యువతి మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. వరంగల్ చౌరస్తాలోని ఏటీఎం నుంచి రూ. 25 వేలు డ్రా చేసిన అనంతరం ఆచూకీ లేకుండా పోయింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు మామునూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

warangal
Hanmakonda
B-tech Student
Missing
  • Loading...

More Telugu News