JIo: జియో కాల్, డేటా చార్జీల పెంపు.. ఇప్పటికే పెంచిన వొడాఫోన్, ఎయిర్ టెల్!

  • డిసెంబరు 3 నుంచి వొడాఫోన్, ఎయిర్ టెల్ చార్జీల పెంపు అమలు
  • 40 శాతం మేర చార్జీలు పెంచిన జియో
  • డిసెంబరు 6 నుంచి కొత్త ప్లాన్లు

ఇప్పటికే వొడాఫోన్, ఎయిర్ టెల్ వంటి మొబైల్ సేవల ఆపరేటర్లు చార్జీలు పెంచిన నేపథ్యంలో జియో కూడా వారి బాటలోనే నడిచింది. వాయిస్, డేటా చార్జీలను 40 శాతం మేర పెంచుతున్నట్టు వెల్లడించింది. సవరించిన చార్జీల విషయమై ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపింది. పెంచిన చార్జీలకు అనుగుణంగా డిసెంబరు 6 నుంచి జియో నుంచి కొత్త ప్లాన్లు రానున్నాయి. ఈ ప్లాన్లు తీసుకున్నవారికి 300 శాతం అదనపు ప్రయోజనాలు అందించాలని జియో నిర్ణయించింది. అన్ లిమిటెడ్ వాయిస్, డేటా సదుపాయం అని ప్రకటించినా, పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. కాగా, వొడాఫోన్, ఎయిర్ టెల్ పెంచిన చార్జీలు డిసెంబరు 3 నుంచి అమలు కానున్నాయి.

  • Loading...

More Telugu News