Pawan Kalyan: పవన్ పర్యటనలో జేబుదొంగల విశ్వరూపం... లబోదిబోమంటున్న బాధితులు

  • పవన్ రాయలసీమ పర్యటన
  • రేణిగుంట చేరుకున్న జనసేనాని
  • స్వైరవిహారం చేసిన జేబుదొంగలు

ప్రజాసమస్యలపై రాయలసీమలో పర్యటించేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ ఈ మధ్యాహ్నం రేణిగుంట చేరుకున్నారు. పవన్ కు స్వాగతం పలికేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు, నేతలు భారీగా తరలివచ్చారు. పవన్ ను చూసేందుకు ఒక్కసారిగా అందరూ ముందుకు రావడంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. ఇదే అదనుగా గుంపులో చేరిన జేబుదొంగలు తమ కత్తెర్లు, బ్లేడ్లకు పని కల్పించారు.

సీన్ కట్ చేస్తే... 30 నుంచి 45 మంది వరకు తమ జేబులో ఉన్న నగదు, వస్తువులు గల్లంతైనట్టు గుర్తించి లబోదిబోమన్నారు. అందరూ రేణిగుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకుని తమ నగదు, మొబైల్ ఫోన్లు రికవరీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, జేబుదొంగల స్వైరవిహారం గురించి నేతలు పవన్ కల్యాణ్ తో చెప్పినట్టు తెలుస్తోంది.

Pawan Kalyan
Jana Sena
Renigunta
Andhra Pradesh
  • Loading...

More Telugu News