Loksatta: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద జయప్రకాష్ నారాయణ కారుకు ప్రమాదం!

  • వెనుక నుంచి కారును ఢీ కొట్టిన ఆటో
  • దెబ్బతిన్న కారు వెనుకభాగం
  • ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలకు గాయాలు

లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ(జేపీ) కారుకు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఇవాళ ఈ ప్రమాదం సంభవించింది. జేపీ కారును వెనుక నుంచి వస్తున్న ఆటో ఢీకొట్టడటంతో కారు వెనుక భాగం నుజ్జునుజ్జయింది. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.

ఒక ప్రైవేట్ కార్యక్రమానికి జేపీ తన కారులో వెళుతున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో కారు ఆపారు. హఠాత్తుగా వెనుక వైపు నుంచి వచ్చిన ఆటో, జేపీ కారును ఢీకొట్టింది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మహిళలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Loksatta
Jaya prakash Narayana
car
accident
  • Loading...

More Telugu News