Asish Reddy: మీడియా ముందుకు ఆశీష్ గౌడ్... సంజన అబద్ధాలు చెబుతోందని ప్రత్యారోపణ!

  • ఆశీష్ పై సంజన ఫిర్యాదు
  • మీడియా ముందుకు వచ్చిన ఆశీష్
  • తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు

రాజకీయంగా ఎదుగుతున్న తనను చూసి ఓర్వలేని కొందరు తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్ వ్యాఖ్యానించారు. గత రాత్రి హైదరాబాద్, హైటెక్స్ సమీపంలోని నోవాటెల్ హోటల్ పబ్ లో తనను వేధించారంటూ ఆశీష్ గౌడ్ పై బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ సంజన మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తనను కలిసిన మీడియాతో మాట్లాడిన ఆశీష్, సంజన తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు. తాను వేధించినట్టు ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి బెదిరింపులకు తాను భయపడబోనని అన్నారు. తాను కూడా పోలీసుల వద్దకు వెళ్లతానని చెప్పారు. కాగా, సంజన ఫిర్యాదుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Asish Reddy
Nandishwar Goud
Sanjana
Police
  • Loading...

More Telugu News