Mahesh Babu: శంషాబాద్ ఘటనపై కవిత రూపంలో హీరో మహేశ్ బాబు ఆవేదన!
![](https://imgd.ap7am.com/thumbnail/tn-b9bc7ca699e6.jpg)
- స్త్రీకి ఆత్మీయుడిగా, స్నేహితుడిగా ఉండాలి
- అతనికి దగ్గరుంటే ప్రమాదం ఉండదన్న నమ్మకాన్ని కలిగించాలి
- ఆత్మగౌరవానికి తోడుగా నిలిచేవాడే మగాడు
- వైరల్ అవుతున్న మహేశ్ బాబు కవిత
వెటర్నరీ వైద్యురాలిపై జరిగిన దారుణ హత్యాచారంపై హీరో మహేశ్ బాబు స్పందించారు. ఈ మేరకు ఓ కవితను చెబుతూ, తనలోని ఆవేదనను ఆయన వ్యక్తం చేశారు.
ఎవరి కళ్లలో సంస్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో... ఎవరి మాట మన్ననగా ఉంటుందో... ఎవరి మనసు మెత్తగా ఉంటుందో... ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో... ఎవరికి ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం... సమాజంలో గౌరవం ఉంటాయో... ఎవరు వాళ్ల శరీరానికి, మనసుకి విలువిస్తారో... వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారో... ఎవరి మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మరిచిపోరో... స్త్రీకి శక్తుంది.. గుర్తింపు, గౌరవం ఉండాలని ఎవరు అనుకుంటారో... ఎవరికి దగ్గరగా ఉంటే... వాళ్లకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో... అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు, ఆత్మీయుడు, సహచరుడు... ఒక్క మాటలో చెప్పాలంటే.. వాడే మగాడు! అన్న మహేశ్ బాబు వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.