Disha: ఏపీలో కూడా ఆడపిల్లలకు రక్షణ లేదు: పంచుమర్తి అనురాధ

  • ఏపీలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది
  • నిందితుల్లో ఎక్కువమంది వైసీపీ అనుకూలురేనంటూ ఆరోపణ
  • ఏపీ సర్కారుపై విమర్శలు

తెలంగాణలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఘటనపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ స్పందించారు. ప్రియాంక రెడ్డి ఉదంతం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఏపీలో కూడా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న అత్యాచార కేసుల్లో నిందితులపై చర్యలు లేవని అన్నారు.

 ఈ అత్యాచార కేసుల్లో ఎక్కువ శాతం వైసీపీకి అనుకూలంగా ఉన్నవాళ్లే ముద్దాయిలుగా ఉన్నారని ఆరోపించారు. ఓ మహిళ హోంమంత్రిగా ఉన్నా ఈ దారుణాలపై స్పందించరని అనురాధ మండిపడ్డారు. గతంలో తాము ఓ అత్యాచార బాలికకు సాయం చేసేందుకు ఆసుపత్రికి వెళదామని అనుకుంటే, బాధిత చిన్నారిని హడావుడిగా ఆసుపత్రి నుంచి తీసుకెళ్లారని ఆరోపించారు. నిందితుడు నరేంద్రరెడ్డిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

Disha
Telangana
Hyderabad
Panchumarthi Anuradha
Telugudesam
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News