Rana Daggubati: రానా కొత్త స్టిల్ చూశారా.. ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడో!

  • కాళ్లకు పొడవైన కర్రలతో రానా వింత లుక్
  • ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన రానా
  • ప్రస్తుతం 'విరాటపర్వం'లో నటిస్తున్న రానా

టాలీవుడ్ లో విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగిపోతున్న నటుడు రానా దగ్గుబాటి. ప్రస్తుతం రానా 'విరాటపర్వం' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే, ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో రానా స్టిల్ ఒకటి సందడి చేస్తోంది. కాళ్లకు పొడవైన కర్రలు తగిలించుకుని రానా వింతగా కనిపిస్తున్నాడు. సర్కస్ లు, ఇతర వినోద కార్యక్రమాల్లో కొందరు కాళ్లకు పొడవైన కర్రలు అమర్చుకుని ఎంతో సమతుల్యంతో నడుస్తుంటారు. ఈ ఫొటోలో రానా కూడా అలాగే కర్రల సాయంతో మరింత పొడవుగా కనిపిస్తున్నాడు. రానానే ఈ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేశాడు.

Rana Daggubati
Tollywood
Virataparvam
Hyderabad
  • Loading...

More Telugu News