Jangaon District: బస్సులోనే యువతిపై వేధింపులు.. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • హైదరాబాద్‌లో పనిచేస్తున్న పాలకుర్తి అమ్మాయి
  • బస్సులో వెంటపడి వేధించిన స్నేహితుడు
  • జనగామలో తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు

తనను పెళ్లి చేసుకోవాలంటూ బస్సులోనే వేధింపులకు పాల్పడిన ఓ యువకుడికి పోలీసులు అరదండాలు వేశారు. తెలంగాణలోని జనగామ పోలీసుల కథనం ప్రకారం.. పాలకుర్తికి చెందిన యువతి (19) హైదరాబాద్, మెహదీపట్నంలోని ఓ సూపర్‌మార్కెట్‌లో ఉద్యోగం చేస్తోంది. పాలకుర్తికే చెందిన యువతి స్నేహితుడు కూడా హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు.

యువతికి నిన్న సెలవు కావడంతో బస్సులో స్వగ్రామానికి బయలుదేరింది. విషయం తెలిసిన యువకుడు కూడా ఆమెతో కలిసి బస్సెక్కాడు. ఈ క్రమంలో ప్రయాణం మొత్తం ఆమెను వేధిస్తూనే ఉన్నాడు. తనతో వచ్చేయమని, పెళ్లి చేసుకుందామని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో భయాందోళనలకు గురైన యువతి బస్సు జనగామలో ఆగిన వెంటనే అతడి నుంచి తప్పించుకుని వెళ్లి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

Jangaon District
girl
boy
arrest
  • Loading...

More Telugu News