Gandhi Bhavan: హైదరాబాద్ లో కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట.. 50 మంది అరెస్ట్

  • గాంధీభవన్‌లో ‘తెలంగాణ బచావో’ సభ
  • ప్రగతి భవన్ ముట్టడికి యువజన నేతల పిలుపు
  • కార్యకర్తలను అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్‌లోని గాంధీభవన్ వద్ద పోలీసులకు, కాంగ్రెస్‌ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ సహా 50 మందిని అరెస్ట్ చేశారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ బచావో’ పేరుతో సభ నిర్వహించారు.

సభ అనంతరం ప్రగతి భవన్ ముట్టడికి అనిల్ యాదవ్ పిలుపునిచ్చారు. దీంతో కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకురావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారిని ముట్టడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో అనిల్ యాదవ్, శ్రీనివాస్‌లు వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య స్వల్ప తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో 50 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని  స్టేషన్‌కు తరలించారు.

Gandhi Bhavan
Hyderabad
Congress
  • Loading...

More Telugu News