South Africa Cricketer Jaqes kalis: సగం గడ్డం, మీసంతో క్రికెటర్ జాక్వెస్ కలిస్!

  • ఈ నెలాఖరు వరకు ఇలాగే ఉంటా
  • ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన క్రికెటర్
  • ఖడ్గమృగాల పరిరక్షణ, గోల్ఫ్ క్రీడ అభివృద్ధికోసమే ఈ సాహసమన్న కలిస్

పాత తరం క్రికెటర్లు గడ్డంతో కనిపించడమే అరుదు. నీట్ గా షేవ్ చేసుకుని మీసాలతో క్రికెటర్లు కనిపించేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ముఖ్యంగా దేశవిదేశీ క్రికెటర్లు గడ్డం పెంచడం ఫ్యాషన్ గా మారింది. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్వెస్ కలిస్ సరికొత్త ఫ్యాషన్ తో ముందుకు వచ్చాడు. గడ్డం, మీసాలు సగమే తీయించుకొని అశ్చర్యపర్చాడు.

దీనిపై మీడియా ఆరా తీయాగా, అంతరించిపోతున్న ఖడ్గమృగాల పరిరక్షణ, గోల్ఫ్ క్రీడ అభివృద్ధికి విరాళాలు సేకరించాలనే ఉద్దేశంతో తాను గడ్డం, మీసాలు సగమే తీయించుకున్నానని తెలిపాడు. ఈ చిత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయగా అభిమానులనుంచి లైక్ లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు నాలుగు లక్షల ఎనబైవేల రాండ్స్(దక్షిణాఫ్రికా కరెన్సీ) విరాళాల రూపేణ సేకరించామన్నాడు. ఈ నెలాఖరువరకు ఇలాగే ఉంటానని ట్వీట్ చేశాడు.

South Africa Cricketer Jaqes kalis
Half beard with mustach
Photo Twitter
  • Loading...

More Telugu News