Chandrababu: మీ అబ్బాయిలను జాగ్రత్తగా పెంచండి: చంద్రబాబునాయుడు

  • మహిళలను గౌరవించే విషయంలో అవగాహన కల్పించాలి
  • ప్రియాంక హంతకులకు సమాజంలో జీవించే హక్కు లేదు
  • వారికి కఠిన శిక్ష పడేలా చూడాలన్న చంద్రబాబు

ప్రతి తల్లిదండ్రులూ తమ అబ్బాయిలను జాగ్రత్తగా పెంచాలని, మహిళలను గౌరవించే విషయంలో, సమానత్వంలో చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. శంషాబాద్ సమీపంలో డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్యపై స్పందించిన ఆయన, ఇంత క్రూరమైన దుశ్చర్య తనను కలచివేసిందన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ఆయన, వారికి సమాజంలో జీవించే హక్కు లేదని మండిపడ్డారు. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో లైంగిక విద్య, లింగ సమానత్వంపై అవగాహన కల్పించాలని, తద్వారా ఈ తరహా ఘటనలను నివారించవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పాఠశాల స్థాయి నుంచే ఇది మొదలవ్వాలని, ప్రతి ఒక్కరూ మార్పు కోసం పాటు పడాలని సూచించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ట్వీట్లు పెట్టారు. 

Chandrababu
Priyaanka Reddy
  • Error fetching data: Network response was not ok

More Telugu News