Tamil Nadu: 80 ఏళ్ల వయసులో విడాకులు తీసుకున్న జంట.. సఖ్యత లేకపోవడమే కారణమట!

  • తమిళనాడులోని మధురైలో ఘటన
  • పాతికేళ్లుగా విడిగా ఉంటున్న జంట
  • విడాకులు మంజూరు చేసిన కోర్టు

అవును! కాటికి కాలు చాపే వయసులో ఓ వృద్ధ జంట విడాకులు తీసుకుంది. సర్వత్ర చర్చనీయాంశమైన ఈ ఘటన తమిళనాడులోని మధురైలో జరిగింది. ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో గత రెండున్నర దశాబ్దాలుగా వేర్వేరుగా ఉంటున్న వీరికి మధురై కోర్టు నిన్న విడాకులు మంజూరు చేసింది.

 పలయంపట్టికి చెందిన వేలుస్వామి (82), కస్తూరి (80) దంపతులకు 1962లో వివాహం జరిగింది. అప్పటి నుంచీ అన్యోన్యంగా సాగిన వారి వైవాహిక జీవితంలో పాతికేళ్ల క్రితం కలతలు ఏర్పడ్డాయి. దీంతో మలిసంధ్య వేళలో ఇద్దరూ దూరమయ్యారు. విడాకుల కోసం భర్త వేలుస్వామి కోర్టుకెక్కాడు. అది ఇష్టం లేని కస్తూరి తమను తిరిగి కలపాల్సిందిగా కోర్టును అభ్యర్థించినప్పటికీ వేలుస్వామి మాత్రం అంగీకరించలేదు. దీంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది.

Tamil Nadu
Madhurai
divorce
  • Loading...

More Telugu News