Kamal Haasan: ఆసుపత్రి నుంచి కమలహాసన్ డిశ్చార్జి... ఇటీవలే శస్త్రచికిత్స!

  • మూడేళ్ల కిందట కమల్ కు గాయం
  • కాలులో రాడ్ అమర్చిన వైద్యులు
  • ఇటీవలే శస్త్రచికిత్స ద్వారా రాడ్ తొలగింపు

ప్రముఖ కథానాయకుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్ కు ఇటీవలే శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ సర్జరీ నుంచి కోలుకున్న ఆయన ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మూడేళ్ల కిందట శభాష్ నాయుడు చిత్రం షూటింగ్ లో కమల్ కు దెబ్బలు తగిలాయి. దాంతో వైద్యులు ఆయన కాలులో రాడ్ అమర్చారు.

తాజాగా నవంబరు 22న మరోసారి సర్జరీ నిర్వహించి కాలులోని రాడ్ ను తీసివేశారు. కోలుకున్న కమలహాసన్ ను ఇవాళ డిశ్చార్జి చేశారు. నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కమల్ కు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ లోకనాయకుడు శంకర్ దర్శకత్వంలో భారతీయుడు సీక్వెల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Kamal Haasan
Rod
Injury
Shabhash Naidu
Tamilnadu
MNM
  • Loading...

More Telugu News