Cow: యజమానిని కొమ్ములతో పొడిచి, తొక్కి చంపేసిన ఆవు!

  • నల్గొండ జిల్లా మునుగోడు సమీపంలో ఘటన
  • నీళ్లు తాగించేందుకు వెళితే, తిరగబడిన ఆవు
  • ఘటన వివరాలు సేకరించిన పోలీసులు

'సాధు జంతువు'గా పిలుచుకునే ఓ ఆవు.. తనను నిత్యమూ ఎంతగానో చూసుకునే యజమానినే కొమ్ములతో పొడిచి, అతని గుండెలపై తన్ని చంపేసింది. ఈ ఘటన నల్గొండ జిల్లా, మునుగోడు సమీపంలో తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, కోతులారం గ్రామానికి చెందిన పి.పాపయ్య (56) తన వ్యవసాయ పనుల కోసం ఓ ఎద్దును, మరో ఆవును కొనుక్కున్నాడు. వాటిని పొలంలోనే బావి పక్కన కట్టేసేవాడు. పొద్దున్నే ఆవు పాలు పితికి, ఇల్లు చేరుకునేవాడు.

ఈ క్రమంలో సోమవారం రాత్రి పొలానికి వెళ్లిన పాపయ్య, తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆయన కుమారుడు నరేశ్ వెళ్లి చూశాడు. అతన్ని చూడగానే, ఆవు వెంటపడటంతో, పారిపోయి ఇంటికి వచ్చాడు. మరికొంతమందిని తీసుకెళ్లి, ఆవును అదుపు చేసి, కట్టేసి చూడగా, పాపయ్య అప్పటికే విగతజీవిగా కనిపించాడు. నీళ్లు తాగిస్తుంటే ఆవు తిరగబడినట్టు వారు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి దర్యాఫ్తు ప్రారంభించారు.

Cow
Nalgonda District
Munugodu
Died
  • Error fetching data: Network response was not ok

More Telugu News