ShivaKrishna: ఫస్టు సినిమానే ప్రభాస్ ఎలాంటి బెరుకు లేకుండా చేశాడు: సీనియర్ నటుడు శివకృష్ణ

  • ఒకప్పటి పరిస్థితులు వేరు 
  •  అప్పట్లో బాగా భయపడేవాళ్లం 
  •  ప్రభాస్ సింగిల్ టేక్ లో చేశాడన్న శివకృష్ణ

సీనియర్ నటుడు శివకృష్ణ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. "మా కాలంలో సినిమా ఇండస్ట్రీతో ముందు నుంచి పరిచయం లేకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. కెమెరా ముందుకు రావడానికి మేము చాలా టెన్షన్ పడేవాళ్లం. పెద్ద ఆర్టిస్టులతో చేయడానికి భయపడేవాళ్లం. షాట్ కి ముందు పక్కకి వెళ్లి చమటలు తుడుచుకుని వచ్చేవాళ్లం.

ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఉదాహరణకి ప్రభాస్ నే చూడండి .. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పెరిగాడు. అందువల్లనే 'ఈశ్వర్' ఫస్టు సినిమా అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా చాలా నేచురల్ గా చేశాడు. ఆ సినిమాలో నేను కూడా నటించాను. నా కాంబినేషన్లోని సీన్ ను ఒకేసారి దర్శకుడు ప్రభాస్ కి చెప్పారు. పెద్ద డైలాగ్ తో కూడిన సీన్ అది. అయినా ప్రభాస్ సింగిల్ టేక్ లో చేసేశాడు .. అది చూసి నేను ఆశ్చర్యపోయాను" అని చెప్పుకొచ్చారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News