Albenia: ఆల్బేనియాలో భారీ భూకంపం!

  • రిక్టర్ స్కేల్ పై 6.4 తీవ్రత
  • 20 మంది మృతి, 600 మందికి గాయాలు
  • కుప్పకూలిన పలు భవనాలు

ఆల్బేనియాను భారీ భూకంపం గడగడలాడించింది. స్థానిక కాలమానం ప్రకారం, మంగళవారం ఉదయం ఈ భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.4 గా నమోదైందని వెల్లడించారు. అందరూ నిద్రిస్తున్న వేళ ఈ భూకంపం సంభవించడంతో 20 మందికి పైగా మరణించినట్టు ప్రాథమిక సమాచారం. మరో 600 మందికిపైగా ప్రజలకు గాయాలు అయ్యాయి. రాజధాని తిరానాకు 30 కిలోమీటర్ల దూరంలో 20 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉంది. దీని ధాటికి పలు భవనాలు నేలకూలాయి. రంగంలోకి దిగిన సహాయక బృందాలు, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Albenia
Earth Quake
Buildings
  • Loading...

More Telugu News