APSRTC: డిసెంబర్ 1నుంచి ఏపీ బస్సుల్లో లైవ్ ట్రాకింగ్ వ్యవస్థ

  • బస్సు ఎక్కడ ఉందన్న విషయం తెలుసుకునే వీలు
  • ప్రయాణికులకు బస్సు డ్రైవర్ల ఫోన్ నెంబర్లు పంపే ఏర్పాటు  
  • బస్సు డ్రైవర్ కు ఫోన్ చేసి సమాచారం అడిగే సౌలభ్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు నడిచే రూట్ల గురించి ప్రయాణికులకు కచ్చితమైన సమాచారం తెలిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ లైవ్ బస్ ట్రాకింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తోంది. డిసెంబర్ 1నుంచి ప్రయాణికులందరికీ లైవ్ బస్ ట్రాకింగ్ యాప్ అందుబాటులోకి రానుందని తెలిపింది. డ్రైవర్ల నెంబర్లను ప్రయాణికులకు సంక్షిప్త సందేశం రూపంలో పంపుతామని  ప్రకటించింది. బస్సు డ్రైవర్ కు ఫోన్ చేసి బస్సుల రాకపోకల సమాచారం కూడా తెలుసుకోవచ్చని ఆర్టీసీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News