Chris Gayle: ఇన్నాళ్ల ఫ్రాంచైజీ క్రికెట్ జీవితంలో నేను తెలుసుకున్నది ఇదీ!: క్రిస్ గేల్ ఆవేదన

  • ఇటీవల విఫలమవుతున్న గేల్
  • ఎంఝాన్సీ క్రికెట్ గేల్ జట్టు ఓటమి
  • తనను జట్టుకు భారంగా చూస్తున్నారంటూ విచారం

క్రిస్ గేల్... క్రికెట్ తో పరిచయం ఉన్నవారికి ఈ పేరు చిరపరిచితం. బ్యాటింగ్ విధ్వంసానికి పర్యాయపదంలాంటి ఈ కరీబియన్ బ్యాట్స్ మన్ క్రీజులో ఉన్నాడంటే ఎలాంటి బౌలర్ అయినా ఆత్మరక్షణ ధోరణిలో పడిపోతాడు. అయితే కొంతకాలంగా ఫామ్ కోల్పోయి స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చడంలో విఫలమవుతున్న గేల్ ను అనేక ఫ్రాంచైజీలు వదిలించుకునేందుకు సిద్ధపడుతున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికాలో ఎంఝాన్సీ క్రికెట్ లీగ్ ఆడుతున్న గేల్ ఓ మ్యాచ్ లో పేలవ ప్రదర్శన అనంతరం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

తాను మూడ్నాలుగు మ్యాచ్ ల్లో విఫలమైతే చాలు, జట్టుకు భారంగా భావిస్తున్నారని వెల్లడించాడు. ఈ జట్టు మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా తాను ఆడుతున్న లీగ్ ల్లో ప్రతి చోట అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయని తెలిపాడు. కొంతకాలంగా తన ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్ ను విశ్లేషిస్తే వెల్లడైన వాస్తవం ఇదని పేర్కొన్నాడు. కొన్ని మ్యాచ్ ల్లో విఫలం అయితే తనకు కనీస గౌరవం ఇవ్వడంలేదని వాపోయాడు. తన గత రికార్డులను ఎవరూ పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశాడు.

Chris Gayle
Cricket
West Indies
League Cricket
  • Loading...

More Telugu News