cm: సీఎం జగన్ తో వల్లభనేని వంశీ భేటీ

  • మంత్రి కొడాలి నానిని కలిసిన వంశీ
  • జగన్ వద్దకు తీసుకెళ్లిన కొడాలి
  • పలు అంశాలపై జగన్ తో చర్చ

తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ తో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ రోజు భేటీ అయ్యారు. అంతకుముందు, మంత్రి కొడాలి నానిని వంశీ కలిశారని, జగన్ వద్దకు వంశీని ఆయన తీసుకెళ్లినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వీరు పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఇదిలా వుండగా, టీడీపీ నుంచి ఇటీవలే బయటకు వచ్చిన వంశీ ముఖ్యమంత్రి జగన్ కి మద్దతు ప్రకటిస్తానని, ఆయనతో కలసి నడుస్తానని పేర్కొన్న విషయం విదితమే. 

cm
jagan
Vallabhaneni Vamsi
kodali nani
  • Loading...

More Telugu News