Prakash Raj: 'రంగమార్తాండ'లో అనసూయ?

  • సెట్స్ పైకి వెళ్లిన 'రంగమార్తాండ'
  • ప్రధాన పాత్రల్లో ప్రకాశ్ రాజ్ - రమ్యకృష్ణ 
  • కృష్ణవంశీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనసూయ

ఇటు బుల్లితెరపై .. అటు వెండితెరపై అనసూయకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బుల్లితెరకి సంబంధించిన కార్యక్రమాలతో బిజీగా వున్న ఆమె, సినిమాల్లో తనకి నచ్చిన పాత్రలకి మాత్రమే ఓకే చెబుతూ వెళుతోంది. అలా ఆ మధ్య 'రంగస్థలం' సినిమాలో ఆమె చేసిన 'రంగమ్మత్త' పాత్ర ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక 'కథనం' సినిమాలో ప్రధానమైన పాత్రనే చేసింది.

అలాంటి అనసూయ తాజాగా 'రంగమార్తాండ' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ - రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషిస్తుండగా, బ్రహ్మానందం ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. అలాంటి ఈ సినిమా కోసం కృష్ణవంశీ టీమ్ సంప్రదించగా, అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. అనసూయ పాత్ర ఏమిటి? ఆమెను కృష్ణవంశీ ఎలా చూపించనున్నాడనేది ఆసక్తికరమైన అంశమే.

Prakash Raj
Ramya Krishna
Anasuya
  • Loading...

More Telugu News