Pakistan: పాక్ క్రికెటర్ల వద్ద డబ్బులు తీసుకోని భారతీయ క్యాబ్ డ్రైవర్... హోటల్ కు తీసుకెళ్లి విందు ఇచ్చిన క్రికెటర్లు
- ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న పాక్ జట్టు
- ఇండియన్ రెస్టారెంట్ కు వెళ్లాలనుకున్న పాక్ క్రికెటర్లు
- రెస్టారెంట్ కు తీసుకెళ్లిన భారత క్యాబ్ డ్రైవర్
ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. బ్రిస్బేన్ లో తొలి టెస్టు ముగిసింది. ఈ టెస్టు సందర్భంగా ఐదుగురు పాక్ క్రికెటర్లు ఓ క్యాబ్ లో ఇండియన్ రెస్టారెంట్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారు ఎక్కిన క్యాబ్ డ్రైవర్ ఓ భారతీయుడు. వారిని రెస్టారెంట్ కు తీసుకెళ్లిన ఆ డ్రైవర్ క్రికెటర్లపై గౌరవంతో డబ్బులు తీసుకోలేదు. దాంతో ఆశ్చర్యానికి గురైన ఆ క్రికెటర్లు క్యాబ్ డ్రైవర్ ను తమతో పాటు రెస్టారెంట్ కు తీసుకెళ్లి విందు ఇచ్చారు. ఈ విషయాన్ని ఆ డ్రైవర్ ఓ రేడియో వ్యాఖ్యాతకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.