zee Entetainment Charman subhash chandhra resigned: జీ ఎంటర్ టైన్ మెంట్స్ ఛైర్మన్ సుభాష్ చంద్ర రాజీనామా

  • రాజీనామాను అమోదించిన కంపెనీ బోర్డు
  • వాటాదారుల మార్పు నేపథ్యంలో వైదొలిగిన సుభాష్
  • ఇకముందు నాన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కొనసాగింపు

ప్రసిద్ధ మీడియా సంస్థ జీ ఎంటర్ టైన్ మెంట్స్ లిమిటెడ్ ఛైర్మన్ సుభాష్ చంద్ర తన పదవికి రాజీనామా చేశారు. కంపెనీ షేర్ హోల్డర్ల మార్పు దృష్ట్యా ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా ఆయన రాజీనామాను కంపెనీ బోర్డు అమోదించినట్లు సమాచారం. ఛైర్మన్ పదవినుంచి వైదొలిగిన సుభాష్ చంద్ర ఇకముందు కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మాత్రమే కొనసాగనున్నారు.

 సెబీ నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ స్టాక్ మార్కెట్ కు సమర్పించిన ఫైలింగ్ లో వెల్లడించింది. తమ సంస్థకు ఫైనాన్స్ చేసిన పెట్టుబడిదారుల బకాయిలను తీర్చేందుకు జీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థకు చెందిన 16.5 శాతం వాటాను విక్రయిస్తున్నట్లు సుభాష్ చంద్రకు చెందిన ఎస్సెల్ గ్రూప్ ఇటీవల తెలిపింది. అదేవిధంగా సెప్టెంబర్ లో కూడా ఇదే సంస్థ జీ లిమిటెడ్ కు చెందిన 11 శాతం వాటాను ఇన్వెస్కో-ఓపెన్ హైమర్ కంపెనీకి అమ్మిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు కంపెనీలో చోటుచేసుకున్నాయని తెలుస్తోంది.

zee Entetainment Charman subhash chandhra resigned
  • Loading...

More Telugu News