Nara Lokesh: జగన్ అబద్ధపు హామీలకు ఆకులు రాలడం ఏంటి, ఏకంగా చెట్లే పడిపోతాయ్: నారా లోకేశ్ వీడియో సెటైర్

  • సీఎం జగన్ పై లోకేశ్ ట్వీట్
  • వైసీపీ అబద్ధపు హామీలు అంటూ వీడియో
  • అత్తారింటికి దారేది సీన్ తో జగన్ పై విమర్శలు

కొన్నాళ్ల కిందట టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో బ్రహ్మానందం అబద్ధాలు ఆడుతుండగా ఓ చెట్టు ఆకులు రాలిపోయే సీన్ అద్భుతంగా పండింది. ఇప్పుడదే సీన్ ను టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సీఎం జగన్ ను విమర్శించడానికి ఉపయోగించుకున్నారు. సీఎం జగన్ ఇచ్చిన అబద్ధపు హామీలకు ఆకులు రాలడం ఏంటి, ఏకంగా చెట్లే పడిపోతాయి అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ సందర్భంగా పోస్టు చేసిన వీడియోలో, ఓవైపు జగన్ హామీలు గుప్పిస్తుండగా, మరోవైపు చెట్టు ఆకులు రాలిపోతుంటాయి.

Nara Lokesh
Jagan
Telugudesam
YSRCP
Andhra Pradesh
Pawan Kalyan
Attarintiki Daredi
Tollywood
Trivikram
  • Error fetching data: Network response was not ok

More Telugu News