Chennai Metro Rail: చెన్నై మెట్రో రైళ్లలో డిసెంబర్ నుంచి ఉచిత వైఫై

  • ఇప్పటికే మెట్రో స్టేషన్లలో ఉచిత ఫైఫై 
  • ఇందుకు సంబంధించి యాప్ సిద్ధం
  • పలు భాషల సినిమాలు, పాటలతో ప్రయాణికులకు వినోదం 

చెన్నైలోని మెట్రో రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త. ఇకపై అక్కడి మెట్రో రైళ్లలో కూడా ఉచిత వైఫై కల్పించనున్నారు. ఇప్పటికే చెన్నై మెట్రో స్టేషన్లలో వైఫై సౌకర్యం ఉంది. డిసెంబర్ నెల నుంచి ఈ సౌకర్యాన్ని అక్కడి మెట్రో రైళ్లలో కూడా అందించనున్నారు. దీనికి సంబంధించి ఒక యాప్ ను కూడా అభివృద్ధి చేశారు. దీన్ని డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.

అనంతరం యాప్ ఓపెన్ చేస్తే చాలు. తమిళం, మలయాళం, హిందీ, తెలుగు సినిమాలు, పాటలు చూస్తూ ప్రయాణంలో బోర్డమ్ ను అధిగమించవచ్చంటున్నారు మెట్రో నిర్వాహకులు.

Chennai Metro Rail
Free Wifi
  • Loading...

More Telugu News