Telangana: తాత్కాలిక డ్రైవర్లకు శిక్షణ అవసరమంటూ హైకోర్టులో పిల్

  • కనీసం 90 రోజులపాటు శిక్షణ ఇప్పించాలంటూ పిటిషనర్ అభ్యర్థన
  • నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలంటూ.. ఆర్టీసీ, ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు
  • కార్మికుల వేతనాలపై దాఖలైన పిటిషన్ విచారణ 27కు వాయిదా

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో యాజమాన్యం తాత్కాలిక డ్రైవర్లను నియమించి బస్సులు నడిపిస్తున్న నేపథ్యంలో సదరు డ్రైవర్లకు అనుభవం లేదంటూ.. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది గోపాలకృష్ణ ఈమేరకు పిల్ వేశారు. తాత్కాలిక డ్రైవర్లకు కనీసం 90 రోజులపాటు శిక్షణ ఇచ్చే విధంగా ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

దీనిపై విచారణ చేపట్టిన కోర్టు నాలుగు వారాల్లో వివరణ సమర్పించాలంటూ ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వానికి ఆదేశాలను జారీచేసింది. కాగా సెప్టెంబర్ నెల వేతనాలు చెల్లించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు వేసిన పిటిషన్ పై విచారణను కోర్టు ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Telangana
RTC
Training to Temporary Drivers
PIL
High Court hearing
  • Loading...

More Telugu News