Rajinikanth: మలేషియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టిన రోజు వేడుకలు.. నిర్వహించనున్న నిర్మాత

  • వచ్చే నెల 12న రజనీకాంత్ బర్త్ డే
  • ఏర్పాట్లు చేస్తున్న నిర్మాత యూసుఫ్
  • ఇటీవల చెన్నైలో రజనీని కలిసి ముందస్తు విషెస్

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు వేడుకలను మలేషియాలో నిర్వహించనున్నట్టు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ డత్తో మహ్మద్ యూసుఫ్ తెలిపారు. రజనీకాంత్ నటించిన ‘2.ఓ’, ‘కాలా’ వంటి సినిమాలను మలేషియాలో యూసుఫ్ విడుదల చేశారు. ఇటీవల చెన్నైలో రజనీకాంత్‌ను కలిసిన యూసుఫ్ ఆయనకు ముందస్తుగా బర్త్ డే విషెస్ తెలిపారు.

ఈ సందర్భంగా యూసుఫ్ మాట్లాడుతూ.. డిసెంబరు 12న మలేషియాలోని ఓ థియేటర్‌లో రజనీకాంత్ బర్త్ డే వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిపారు. డీఎంవై క్రియేషన్స్ బ్యానర్‌పై ఇప్పటి వరకు ఆయన 167 చిత్రాలను విడుదల చేశారు. మలేషియాలో రజనీ సినిమాలకు మంచి మార్కెట్ ఉండడంతో అక్కడ ఆయన చిత్రాలను యూసుఫ్ విడుదల చేస్తున్నారు.

Rajinikanth
birthday
malaysia
  • Loading...

More Telugu News