Narendra Modi: మీ భాష, మీ యాసలో మాట్లాడండి.. మాతృభాషలపై మోదీ కీలక ప్రసంగం

  • ‘మన్‌ కీ బాత్’లో మాతృభాషల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పిన ప్రధాని
  • అమ్మ భాషతోనే అభివృద్ధి సాధ్యమన్న మోదీ
  • రంగ్ జాతి ప్రజలు అందరికీ ఆదర్శం కావాలి

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాతృభాషల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. అమ్మభాషతోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఐక్య రాజ్య సమితి కూడా మాతృభాషల ప్రాధాన్యాన్ని గుర్తించిందన్న మోదీ.. అందుకే ఈ ఏడాదిని ‘అంతర్జాతీయ మాతృభాషల సంవత్సరం’గా ప్రకటించిందని గుర్తు చేశారు.

ఉత్తరాఖండ్‌లోని దారుచులా ప్రాంతంలో రంగ్ జాతి ప్రజలు లిపి లేని తమ భాష ‘రంగ్లో’ను పరిరక్షించేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. పదివేల వరకు ఉండే ఆ జాతి ప్రజలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని మరీ భాషాభివృద్ధికి పాటుపడుతున్నారని ప్రశంసించారు. ఇది అందరికీ స్ఫూర్తి కావాలని, ఎవరి భాషను వారు, వారి యాసతో ఉపయోగించడం ప్రారంభించాలని మోదీ సూచించారు. ఎంత అభివృద్ధిని  సాధించినా మాతృభాషను విస్మరిస్తే దానికి అర్థం ఉండదని మోదీ పేర్కొన్నారు.

Narendra Modi
mann ki bat
mother tongue
  • Loading...

More Telugu News