Maharashtra: మహారాష్ట్రలో ఊపందుకున్న క్యాంప్ రాజకీయాలు... ఎమ్మెల్యేలను స్టార్ హోటళ్లకు తరలించిన మూడు పార్టీలు
- బలనిరూపణకు సిద్ధమైన ఫడ్నవీస్ సర్కారు
- జాగ్రత్తపడుతున్న కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ
- ఎమ్మెల్యేలున్న హోటళ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో క్యాంప్ రాజకీయాలకు తెరలేచింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు స్టార్ హోటళ్లకు తరలించాయి. ఫడ్నవీస్ సర్కారు అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సి ఉండడంతో బీజేపీకి దొరక్కుండా ఉండేందుకు ఆ మూడు పార్టీలు తమ ఎమ్మెల్యేలను స్టార్ హోటళ్లలో ఉంచి కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను జుహూ ఏరియాలోని జేడబ్ల్యూ మారియట్ హోటల్ కు, శివసేన ఎమ్మెల్యేలను ఎయిర్ పోర్టు సమీపంలోని లలిత్ హోటల్ కు, ఎన్సీపీ ఎమ్మెల్యేలను రెనాసెన్స్ హోటల్ కు తరలించారు. ఆయా పార్టీల ఎమ్మెల్యేలు బస చేసిన హోటళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.