Telangana: తెలంగాణలో 51వ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె... అడుగు ముందుకే అంటున్న అశ్వత్థామరెడ్డి

  • సమ్మె యధాతథం అంటున్న ఆర్టీసీ జేఏసీ
  • ఎంజీబీఎస్ లో జేఏసీ సమావేశం
  • డిపోలు, కూడళ్ల వద్ద కార్యక్రమాలు

తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన సమ్మె నేటికి 51వ రోజుకు చేరుకుంది. ఇటీవల విధుల్లో చేరేందుకు కార్మికులు మొగ్గు చూపినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సమ్మె కొనసాగుతోంది. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని, ఇందులో ఎటువంటి మార్పులేదని స్పష్టం చేశారు.

ఇవాళ హైదరాబాద్ ఎంజీబీఎస్ లో జేఏసీ నేతలు సమావేశమయ్యారు. నేడు అన్ని డిపోల్లో తలపెట్టిన మానవహారాలు, మౌనదీక్షలు విజయవంతం అయ్యాయని తెలిపారు. ఇకపైన కూడా తమ కార్యాచరణ కొనసాగుతుందని, డిపోలు, కూడళ్ల వద్ద కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News