Dharmadi Sathyam: మరోసారి రంగంలోకి దిగిన ధర్మాడి సత్యం... ఓ చిన్నారి కోసం అన్వేషణ!

  • కాకినాడలో కిడ్నాప్ కు గురైన ఏడేళ్ల దీప్తిశ్రీ
  • సవతతల్లిపై అనుమానం
  • హత్యచేసి ఉప్పుటేరులో పడేసినట్టు భావిస్తున్న పోలీసులు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీని  హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమె సవతి తల్లి శాంతకుమారి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని దీప్తిశ్రీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కీలక సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. శాంతకుమారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రపాలెం లాకుల వద్ద దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అందుకోసం పోలీసులు ధర్మాడి సత్యం బృందం సాయం కోరారు.

ఇటీవలే గోదావరి నదిలో బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం ఓ చిన్నారి కోసం వెంటనే స్పందించారు. తన బృందంతో ఉప్పుటేరులో గాలింపు చేపట్టారు. అయితే, 30 గంటలు గడిచిన తర్వాతే మృతదేహం నీటిపై తేలుతుందని, ఈలోపు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు.

Dharmadi Sathyam
Kakinada
Andhra Pradesh
Police
Deepthi Sree
  • Loading...

More Telugu News