Actress Tapsee: త్వరలో మరిన్ని దక్షిణాది చిత్రాల్లో నటిస్తా: తాప్సి

  • నటనకు సంబంధించి ఓనమాలను నేర్చుకున్నదిక్కడే
  • దక్షిణాది సినిమాలను వదులుకుంటే అది తెలివి తక్కువతనమే  
  • ఇక్కడి చిత్రపరిశ్రమతో నాకెంతో అనుబంధం ఉంది  

ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో విరామంలేకుండా ఉన్నానని, అయినప్పటికీ త్వరలో మరిన్ని దక్షిణాది చిత్రాల్లో నటిస్తానని కథానాయిక తాప్సి చెప్పారు. ఈ రోజు ఆమె గోవాలో కొనసాగుతోన్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దక్షిణాది సినిమాల్లో నటించే అవకాశాన్ని వదులుకుంటే అది తెలివి తక్కువతనమే అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు.

‘దక్షిణాది చిత్రపరిశ్రమతో నాకెంతో అనుబంధం ఉంది. నటనకు సంబంధించి ఓనమాలను ఇక్కడే నేర్చుకున్నాను. బాలీవుడ్ లోకి ప్రవేశించడానికి దక్షిణాది పరిశ్రమను పునాదిగా వాడుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. రానున్న రోజుల్లో మరిన్ని దక్షిణాది సినిమాల్లో కూడా నటించాలని కోరుకుంటున్నా. దక్షిణాది సినిమాలను వదులుకుంటే అది తెలివి తక్కువతనమే అవుతుంది’ అని పేర్కొంది.

Actress Tapsee
IIFI -GOA participation
comments on South Indian Film Industry
  • Loading...

More Telugu News