Bhuma Akhila Priya: అక్క భూమా అఖిలప్రియపై పిటిషన్ వేసిన వార్తలపై జగత్ విఖ్యాత్ రెడ్డి స్పందన

  • మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మకండి
  • మేమంతా కలిసే ఉన్నాం
  • మచ్చ వచ్చే పనులేవీ మేము చేయం

భూవివాదానికి సంబంధించి టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై జగత్ విఖ్యాత్ రెడ్డి ఓ వీడియో ద్వారా స్పందించారు. ఆయన వివరణ ఏమిటో ఆయన మాటల్లోనే చూద్దాం.

'నమస్కారమండీ. పొద్దున్నుంచి మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. నేనేదో కేసులు వేశానని చెబుతున్నారు. నేను దుబాయ్ లో ఉండటం వల్ల ఎవరికీ అందుబాటులోకి రాలేకపోతున్నా. అందుకే ఈ వీడియో ద్వారా అసలు విషయాన్ని అందరికీ తెలియజేసుకుంటున్నా. మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మకండి. అవన్నీ అసత్యాలే. మేమంతా కలిసే ఉన్నాం. భూమా కుటుంబాన్ని, భూమా కేడర్ ని ఎలా బలపరచాలా అనే మేమంతా ఆలోచిస్తామే కానీ... మచ్చ వచ్చే పనులేవీ మేము చేయం. మీడియాలో వచ్చే వార్తలను దయచేసి నమ్మకండి.' అంటూ జగత్ విఖ్యాత్ రెడ్డి వీడియో ద్వారా అందరినీ కోరారు.

Bhuma Akhila Priya
Bhuma Jagath Vikhyath Reddy
Telugudesam
Case
  • Loading...

More Telugu News