Warangal Urban District: ఆస్ట్రేలియా అమ్మాయిని పెళ్లాడిన హన్మకొండ యువకుడు

  • పెర్త్‌లో స్థిరపడిన దినేశ్ బాబు
  • ఎం.ఫార్మసీ చదువుతుండగా మార్గరెట్‌తో లవ్
  • వైభవంగా జరిగిన వివాహం

విదేశీ యువతులను పెళ్లాడుతున్న తెలుగు రాష్ట్రాల యువకుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల స్పెయిన్ అమ్మాయిని తాడిపత్రికి చెందిన అబ్బాయి పెళ్లాడాడు. తాజాగా, వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు ఆస్ట్రేలియా యువతిని పెళ్లాడాడు. హన్మకొండకు చెందిన సుఖవాసి దినేశ్‌బాబు ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో స్థిరపడ్డాడు. అక్కడ ఎం.ఫార్మసీ చదువుతుండగా మార్గరెట్ రెబ్లింగ్‌తో ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. దీంతో శుక్రవారం హన్మకొండలో హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం వైభవంగా జరిగింది.

Warangal Urban District
Hanmakonda
Australia
Marriage
  • Loading...

More Telugu News