Varun Tej: రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్ తో చిన్ననాటి ఫొటో షేర్ చేసిన వరుణ్ తేజ్

  • హిట్లతో దూసుకుపోతున్న వరుణ్ తేజ్
  • ఇటీవల గద్దలకొండ గణేశ్ తో మరో హిట్
  • ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో నటిస్తున్న మెగా హీరో

గద్దలకొండ గణేశ్ చిత్రంతో భారీ హిట్ సొంతం చేసుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు. మొదటి నుంచి విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ తేజ్ అటు సక్సెస్ రేట్ తగ్గకుండా మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న యువ హీరోల్లో వరుణ్ తేజ్ ఒకడనడంలో సందేహం అక్కర్లేదు. ఇక అసలు విషయానికొస్తే తన మెగా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఓ ఫొటోను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, సుస్మితలతో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటోకు విశేషమైన స్పందన లభిస్తోంది.

Varun Tej
Ramcharan
Sai Dharam Tej
Sushmitha
Allu Arjun
Tollywood
  • Loading...

More Telugu News