Virat Kohli: ఇదేంటి... పెద్ద హాకీ బాల్ లాగా ఉంది: పింక్ బంతిపై కోహ్లీ వ్యాఖ్యలు

  • రేపటి నుంచి భారత్-బంగ్లాదేశ్ డేనైట్ టెస్టు
  • మ్యాచ్ కోసం పింక్ బాల్ తో ప్రాక్టీసు చేసిన టీమిండియా
  • పింక్ బంతితో ఫీల్డర్లకు తిప్పలు తప్పవంటున్న కోహ్లీ

టీమిండియా, బంగ్లాదేశ్ జట్లు కోల్ కతాలో రేపటి నుంచి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ షురూ చేయనున్నాయి. గతకొంతకాలంగా టెస్టు క్రికెట్లో అద్వితీయ ప్రదర్శన కనబరుస్తున్న కోహ్లీ సేన తొలిసారి డేనైట్ టెస్టు ఆడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ముమ్మర సాధన చేశాయి. ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా పింక్ బాల్ ఉపయోగిస్తుండగా, తమ మ్యాచ్ సన్నద్ధతపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. పింక్ బాల్ ను ఓ పెద్ద హాకీ బంతితో పోల్చాడు. స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తుంటే ఈ పింక్ బంతి ఎంతో కఠినంగా దూసుకువస్తోందని, తొలినాళ్లలో ఆడిన సింథటిక్ బంతి గుర్తుకువస్తోందని వ్యాఖ్యానించాడు.

బంతి ఉపరితలం మీద అదనపు పైపూత కారణంగా దీనికి అధిక దృఢత్వం వచ్చిందని, వికెట్ కీపర్ కు విసిరే త్రోల విషయంలో ఎరుపు రంగు బంతికంటే దీన్ని విసిరేందుకు అదనపు శక్తి ఉపయోగించక తప్పదని అభిప్రాయపడ్డాడు. గాల్లో మరింత ఎత్తుకు లేచే క్యాచ్ లను పట్టే విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అరచేతులు దెబ్బతినడం ఖాయమని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News