Jagan: అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు కూడా తరలిపోయేలా చేశారు: పంచుమర్తి అనురాధ

  • రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి
  • వైసీపీ వాళ్లకు ఉపాధి కల్పిస్తే చాలని జగన్ అనుకుంటున్నారు
  • అధికారంలోకి రాగానే యువతను మోసం చేశారు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ సీఎం అయ్యాకే తాడేపల్లి ప్రాంతం గంజాయికి అడ్డాగా మారిందని ఆమె అన్నారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు ఒక్కొక్కటిగా తరలిపోతున్నాయని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం పలు పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చిందని... కానీ, పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరలించడమే లక్ష్యంగా జగన్ పని చేస్తున్నారని విమర్శించారు. అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు కూడా వెళ్లిపోయేలా చేశారని అన్నారు.

సొంత పార్టీ వాళ్లకు ఉపాధి ఉంటే చాలని ఆయన అనుకుంటున్నారని దుయ్యబట్టారు. ఒక్క అవకాశం ఇవ్వాలని అడిగిన జగన్... అధికారంలోకి రాగానే యువతను మోసం చేశారని అన్నారు.

Jagan
YSRCP
Panchumarthi Anuradha
Telugudesam
  • Loading...

More Telugu News