devineni: ఈ దుర్మార్గులు ఎన్నికల సమయంలో నోట్లు చించి పంచారు.. ప్రతి ఒక్కరి వద్ద ఈ నోట్లున్నాయి: దేవినేని ఉమ

  • ఆ చిరిగిన నోట్లు తెచ్చిస్తే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామన్నారు
  • చిరిగిన నోట్ల వ్యవహారంపై విచారణ జరిపించాలి
  • ప్రజలను మోసం చేశారు
  • ఈసీ, ఆర్బీఐకి వైసీపీ వివరణ ఇవ్వాలి

వైసీపీ నేతల తీరుపై తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మైలవరంలో నోట్లు చించి పంచిపెట్టారని తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ 'ఎన్నికల తర్వాత చిరిగిన నోట్లు తెచ్చిస్తే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని మభ్యపెట్టారు. చిరిగిన నోట్ల వ్యవహారంపై విచారణ జరిపించాలి' అని వ్యాఖ్యానించారు.

'చిరిగిన నోట్లను ఎన్నికల తర్వాత తెచ్చి చూపిస్తే 5 వేల రూపాయల వరకు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. ఈసీకి, ఆర్బీఐకి వివరణ ఇవ్వాలి. కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు జరపాలి. దీనిపై వైసీపీ కూడా స్పందించాలి. మైలవరంలో గత ఎన్నికలలో గెలవడం కోసం చించిన ఈ  నోట్లను ఇచ్చి, ఎన్నికల్లో గెలిచిన తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పి వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ మోసం చేశారు' అని దేవినేని ఉమ అన్నారు.

'నోట్లు చించి ఎన్ని వేల మందికి పంచారన్న విషయం బయటకు రావాలి. మేము ఆర్బీఐ, ఈసీకి ఫిర్యాదు చేస్తాం. గాంధీజీ బొమ్మ ఉన్న నోట్లను ఈ దుర్మార్గులు చించి పంచారు. సగం నోటును తమ వద్ద పెట్టుకొని, సగం నోటును ప్రజలకు ఇచ్చారు. మైలవరంలో ఏ వ్యక్తి వద్దకు వెళ్లినా ఈ నోట్లు చూపిస్తున్నారు' అని దేవినేని ఉమ చెప్పారు.

'ఈ మాఫియాలను ఎలా అరికడతారు? ప్రజాస్వామ్యాన్ని ఎలా రక్షిస్తారో సీఎం జగన్ చెప్పాలి. అలాగే, కొడాలి నాని మాట్లాడిన మాటలపై జగన్ ఎందుకు స్పందించట్లేదు? ఆయన వ్యాఖ్యలను ఎందుకు సమర్థిస్తున్నారు? అయ్యప్ప మాలలో ఉన్న కొందరు వైసీపీ నేతలు.. ముఖ్యమంత్రి జగన్ డైరెక్షన్ లో పని చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడే అధికారం వైసీపీకి ఎవరు ఇచ్చారు? టీటీడీ విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తోంటే టీటీడీ చైర్మన్ కు కూడా బాధ్యత లేదా? ఏపీలో పత్రికా స్వేచ్ఛను అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు' అని దేవినేని ఉమ తెలిపారు.

  • Loading...

More Telugu News