rrr: రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' హవా మొదలైంది.. గూగుల్ ఇండియాలో నిన్న అత్యధికంగా వెతికిన పేరు ఇదే!

  • మార్మోగిపోయిన ఒలీవియా మోరిస్ పేరు
  • నిన్న 2,00000 సార్లు ఆమె పేరు గూగుల్ లో సెర్చ్ 
  • ఎన్టీఆర్ సరసన ఒలీవియా

ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచి తన సినిమా కోసం ఎదురుచూసేలా చేయడంలో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి శైలి చాలా విభిన్నం. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అంటూ బాహుబలి-2 సినిమాపై ఆయన పెంచిన ఉత్కంఠ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. కొన్ని నెలలుగా ఆయన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించే క‌థానాయిక‌ పేరును వెల్లడించకుండా ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపారు. నిన్న ఆ హీరోయిన్ పేరును వెల్లడించారు.
 
ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ కు సంబంధించిన రోజుకొక వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టింది. నిన్నటితో ఆ ఉత్కంఠకు రాజమౌళి తెరదించి,  తారక్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్  నటించనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమాలో ముఖ్యమైన ప్రతినాయకుల గురించి చిత్ర బృందం తెలియజేసింది. వారికి సంబంధించిన ఫొటోలు చక్కర్లు కొట్టాయి. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న సినిమా కావడంతో దీనిపై దేశ వ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

ఆర్ఆర్ఆర్ లో నటిస్తోన్న ఒలీవియా మోరిస్ ఎవరు? ఆమె గతంలో ఏయే సినిమాల్లో నటించింది? అన్న అమితాసక్తి భారత ప్రేక్షకుల్లో కనపడింది. గూగుల్ ఇండియా ట్రెండింగ్ లో ఒలీవియా మోరిస్ పేరు అత్యధికంగా కనపడింది. నిన్న 2,00000 సార్లు ఆమె పేరును గూగుల్ లో సెర్చ్ చేశారు. ఈ విషయంపై ఆర్ఆర్ఆర్ బృందం ట్విట్టర్ లో తెలిపి, హర్షం వ్యక్తం చేసింది. కాగా,  ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ పేరును ముందుగానే ప్రకటించారు.

  • Loading...

More Telugu News