Donald Trump: ఇండియాకు ఆయుధాలు అమ్ముతున్నా: ట్రంప్ కీలక ప్రకటన
- రూ. 7 వేల కోట్ల విలువైన ఆయుధాల డీల్
- నౌకా దళం కోసం అత్యాధునిక వెపన్స్
- ప్రమాదాలను ఎదుర్కోవడానికేనన్న ట్రంప్
దాదాపు రూ. 7 వేల కోట్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను అమెరికా నుంచి ఇండియా కొనుగోలు చేయనుంది. ఈ విషయాన్ని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్వయంగా అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులకు తెలిపారు. ఇండియాకు భారీగా ఆయుధాలను అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
నౌకా దళానికి ఉపయోగపడేలా 13 ఎంకే 45, 5 అంగుళాలు / 62 కాలిబర్ మోడ్ 4 నావెల్ గన్స్ ను అందించనున్నట్టు వెల్లడించారు. వీటిని బీఏఈ సిస్టమ్స్ అండ్ ఆర్మామెంట్స్ తయారు చేస్తోందని అన్నారు. ఈ ఆయుధాలతో ఇరుగు, పొరుగు దేశాల నుంచి ఉత్పన్నమయ్యే ప్రమాదకర పరిస్థితులను భారత్ తప్పించుకుంటుందని, ఇదే సమయంలో అధునాతన ఆయుధాలు కలిగిన దేశంగానూ ఇండియా మారుతుందని ట్రంప్ అభిప్రాయపడినట్టు వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.