Students: పిల్లలు టిఫిన్ చేయకుండా స్కూల్ కు వెళ్తున్నారా? మరి, మార్కులు తగ్గిపోతాయంటున్న బ్రిటన్ శాస్త్రవేత్తలు!

  • అధ్యయనం చేసిన లీడ్స్ యూనివర్శిటీ
  • బ్రేక్ ఫాస్ట్ చేసే వారికి ఎక్కువ మార్కులు
  • చేయకుంటే పోషకాలు తగ్గుతున్నాయన్న శాస్త్రవేత్తలు

రోజూ ఉదయాన్నే అల్పాహారం తీసుకోకుండా స్కూల్ కు వెళ్లే పిల్లలకు పరీక్షల్లో మార్కులు తగ్గే అవకాశాలు అధికమని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొన్ని ప్రాథమికోన్నత పాఠశాలలను ఎంపిక చేసుకుని, అందులో చదువుతున్న విద్యార్థులపై లీడ్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. దీనిలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

పొద్దున్నే టిఫిన్ తిననివారి శరీరంలో పోషకాలు తగ్గుతున్నాయని, దాని ప్రభావం వారు పొందుతున్న మార్కులపై పడుతోందని అధ్యయనానికి నాయకత్వం వహించిన కేటీ అడోల్ఫస్‌ వెల్లడించారు. విద్యార్థుల గ్రేడ్స్‌ ను పాయింట్ల రూపంలోకి మార్చగా, బ్రేక్‌ ఫాస్ట్‌ చేసే వారికి ఎక్కువ పాయింట్లు వచ్చాయని ఆయన అన్నారు. సామాజిక, ఆర్థిక స్థితిగతులు, వయసు, బీఎంఐ, ఆడా, మగా అన్న ఇతర అంశాలన్నీ పరిగణనలోకి తీసుకున్నా ఇవే ఫలితాలు వచ్చాయని తెలిపారు.

Students
Childrens
Breakfast
London
Leeds University
  • Loading...

More Telugu News