Chennai: హనీమూన్ లో విషాదం.. మనాలీలో పారా గ్లయిడింగ్ చేస్తూ భార్య కళ్లముందే మరణించిన భర్త!

  • గత వారంలో చెన్నైలో వివాహం
  • హిమాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లిన అరవింద్, ప్రీతి
  • భద్రతా బెల్ట్ ను సరిగ్గా కట్టుకోకపోవడంతో ఘోర ప్రమాదం

వారిద్దరూ గతవారమే వివాహ బంధంతో ఒకటైన అరవింద్, ప్రీతి. హనీమూన్ నిమిత్తం మనాలీకి వెళ్లారు. అక్కడ జరిగిన విషాద సంఘటనలో అరవింద్ మరణించాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని ప్రీతి బోరున విలపించింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, చెన్నైకి చెందిన అరవింద్‌ (27), ప్రీతిలకు గత వారం వివాహం జరిగింది. ఈ జంట హిమాచల్‌ ప్రదేశ్‌ లోని మనాలికి వెళ్లారు. అక్కడ పలువురు ఔత్సాహికులు ప్యారాగ్లైడింగ్‌ చేస్తుంటే చూసిన అరవింద్, టికెట్‌ కొనుగోలు చేసి, ప్యారాగ్లైడర్‌ పైలట్‌ హరూరామ్‌ తో కలిసి విహారానికి వెళ్లాడు. ప్రీతి కింద నుంచి ఆసక్తిగా చూస్తుంటే, గాల్లో చక్కర్లు కొట్టాడు.

ఇంతలో అరవింద్‌ నడుముకు కట్టుకున్న బెల్ట్‌ ఉన్నట్టుండి ఊడిపోగా, కింద ఉన్న పల్లంలో పడిపోయి, తీవ్ర గాయాలపాలై, అక్కడికక్కడే మరణించాడు. హరూరామ్, వేగంగా కిందకు దిగి గాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, అరవింద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భద్రతా బెల్ట్‌ ను సరిగా కట్టుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేశారు.

Chennai
New Couple
Honeymoon
Manali
Died
  • Loading...

More Telugu News