: హైకోర్టు నూతన సీజేగా సేన్ గుప్తా


రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తా(కేజీ సేన్ గుప్తా) నియమితులయ్యారు. అందుకు సంబంధించిన నియామకపత్రాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఈ వర్తమానం కేంద్ర న్యాయశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. ఈ నెల 21న ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సేన్ గుప్తాతో గవర్నర్ రాజ్ భవన్ లో ప్రమాణం చేయించనున్నారు. ప్రస్తుతం ఈయన ఉత్తరాఖండ్ హైకోర్టులో సీనియారిటీ ప్రకారం ద్వితీయ స్థానంలో(నంబర్ 2) న్యాయమూర్తిగా ఉన్నారు.

  • Loading...

More Telugu News