Kamal: కమల్ సరసన చేయాలనేసరికి 'దడ' పుట్టేసింది: సీనియర్ హీరోయిన్ ఆమని

  • నా సినిమాలన్నీ నాకు ఇష్టమే 
  • 'శుభసంకల్పం' చిత్రం ప్రత్యేకం 
  • గొప్పవాళ్లతో కలిసి పనిచేశానన్న ఆమని 

తెలుగులో కథా బలమున్న చిత్రాలలో .. బరువైన పాత్రల్లో నటించి మెప్పించిన కథానాయికలలో 'ఆమని' ఒకరు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "తెలుగులో బాపు .. కె.విశ్వనాథ్ గారి సినిమాలలో నటించే అవకాశం రావడం నేను చేసుకున్న అదృష్టం. నేను చేసిన సినిమాలన్నీ నాకు బాగా నచ్చినవే .. అయితే వాటిలో 'శుభసంకల్పం' స్థానం ప్రత్యేకం.

నిర్మాతగా బాలసుబ్రహ్మణ్యం గారు .. దర్శకుడిగా కె. విశ్వనాథ్ గారు .. హీరోగా కమలహాసన్ గారు అందరూ దిగ్గజాలే. అలాంటివారితో కలిసి పనిచేయవలసి వచ్చింది. అలాంటి అవకాశం వచ్చినందుకు ఒక వైపున ఆనందం .. మరో వైపున చేయగలనా? లేదా? అనే భయం. ఇక కమల్ సరసన నటించడానికి వెళ్లగానే 'దడ' పుట్టేసింది. కానీ ఆయన పాత్రలో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతారు .. మనం ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తారు. అక్కడ పాత్రలే ఉంటాయి కనుక .. ఎలాంటి టెన్షన్ లేకుండా చేయగలిగాను" అని చెప్పుకొచ్చారు.

Kamal
Amani
  • Loading...

More Telugu News