Amani: నా అసలు పేరు మంజుల .. ఈవీవీ గారు మార్చారు: సీనియర్ హీరోయిన్ ఆమని

  • తొలి చిత్రం 'జంబలకిడిపంబ'
  • ఈవీవీ గారు పరిచయం చేశారు 
  •  నాగార్జునగారు అర్థం చెప్పారన్న ఆమని

తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన సీనియర్ కథానాయికలలో 'ఆమని' ఒకరు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు. "నా అసలు పేరు 'మంజుల' .. మా ఇంట్లో వాళ్లంతా 'మంజూ' అని పిలుస్తుంటారు. తెలుగులో నేను మొదటిసారిగా 'జంబలకిడిపంబ' చేశాను.

ఈ సినిమా ద్వారా ఈవీవీ సత్యనారాయణగారు నన్ను పరిచయం చేశారు. ఆయనే నా పేరును 'ఆమని'గా మార్చారు. అప్పటికి నాకు ఆ పేరుకు అర్థం తెలియదు. ఆ తరువాత కొంత కాలానికి ఈవీవీగారి దర్శకత్వంలో వచ్చిన 'హలో బ్రదర్' చిత్రంలో ఒక ప్రత్యేక గీతంలో చేశాను. ఆ సమయంలో నాగార్జునగారు మాట్లాడుతూ, నా పేరు బాగుంది అన్నారు. 'ఆమని' అంటే 'వసంతం' అని ఆయనే చెప్పారు. అప్పుడు నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు" అని చెప్పుకొచ్చారు.

Amani
Nagarjuna
EVV
  • Loading...

More Telugu News