BCCI: టీమిండియాకు కొత్త చీఫ్ సెలెక్టర్? 

  • ముగియనున్న ఎమ్మెస్కే ప్రసాద్ పదవీకాలం
  • కొత్త చీఫ్ సెలెక్టర్ పై దృష్టి సారించిన బీసీసీఐ
  • ఎల్.శివరామకృష్ణన్ ను ఎంపిక చేస్తున్నట్టు సమాచారం

టీమిండియాకు కొత్త చీఫ్ సెలెక్టర్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్థానంలో భారత మాజీ స్పిన్ దిగ్గజం ఎల్.శివరామకృష్ణన్ ను బీసీసీఐ ఎంపిక చేస్తున్నట్టు సమాచారం. చీఫ్ సెలెక్టర్ గా ఎమ్మెస్కే ప్రసాద్ పదవీకాలం త్వరలోనే ముగియబోతోంది. దీంతో, కొత్త చీఫ్ సెలెక్టర్ ఎంపికపై బీసీసీఐ దృష్టి సారించింది. డిసెంబర్ 1న బీసీసీఐ వార్షిక సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో చీఫ్ సెలెక్టర్ పై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు చీఫ్ సెలెక్టర్ గా వెంకటేశ్ ప్రసాద్, అర్షద్ అయూబ్, దీప్ దాస్ గుప్తా, అజిత్ అగార్కర్, రోహన్ గవాస్కర్ తదితరుల పేర్లను కూడా బీసీసీఐ పరిశీలించినట్టు సమాచారం.

BCCI
Chief Selector
L Sivaramakrishna
MSK Prasad
  • Loading...

More Telugu News