Marriage: భర్తకు మజ్జిగలో విషం కలిపి ఇచ్చిన నవవధువు!

  • వారం క్రితమే పెళ్లి 
  • ఇష్టంలేని పెళ్లి చేశారన్న ఆగ్రహం  
  • కేసు నమోదు చేసిన పోలీసులు

పెళ్లయిన వారం రోజుల తర్వాత, తన భర్తను హత్య చేయాలని చూసిందో నవవధువు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన లింగమయ్యకు వారం రోజుల క్రితం మదనంతపురం గ్రామానికి చెందిన నాగమణి అనే యువతితో వివాహం జరిగింది. వివాహం తరువాత అత్తారింటికి వచ్చిన నాగమణి, తనకు ఇష్టం లేని పెళ్లి చేశారన్న ఆగ్రహంతో ఉండేది.

ఈ క్రమంలో తన భర్తకు మజ్జిగలో విషం కలిపి ఇచ్చింది. మజ్జిగ తాగిన లింగమయ్య, కాసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతన్ని గమనించిన కుటుంబీకులు, హుటాహుటిన గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న గుత్తి పోలీసులు, దర్యాప్తులో భాగంగా కేసును జొన్నగిరి పోలీసు స్టేషన్‌ కు బదలాయించారు.

Marriage
Poison
Wife
Kurnool District
  • Loading...

More Telugu News