Nawaz Sharif: ఎయిర్ అంబులెన్స్ ద్వారా నవాజ్ షరీఫ్ లండన్ తరలింపు

  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షరీఫ్
  • నాలుగు వారాల అనుమతి ఇచ్చిన హైకోర్టు
  • అవసరం అయితే అమెరికాకు కూడా వెళ్లచ్చు  

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ను మెరుగైన చికిత్స నిమిత్తం లండన్ తరలించారు. లాహోర్ నుంచి ఎయిర్ అంబులెన్స్ ద్వారా షరీఫ్ ను లండన్ తీసుకెళ్లారు. ఆయనను విదేశాలకు తీసుకెళ్లేందుకు లాహోర్ హైకోర్టు ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది. ఈ క్రమంలో సోదరుడు షాబాజ్ షరీఫ్, పర్సనల్ డాక్టర్ తో కలిసి నవాజ్ షరీఫ్ దోహా మీదుగా లండన్ వెళ్లారు. లండన్ వెళ్లేంతవరకు ఆయన ఆరోగ్యం విషమించకుండా స్టెరాయిడ్లు, ఇతర ఔషధాలు అధికమోతాదులో ఇచ్చారు.

లండన్ లోని హరేలీ స్ట్రీట్ క్లినిక్ లో ఆయనకు చికిత్స అందిస్తారు. అవసరం అనుకుంటే అమెరికాలోని బోస్టన్ నగరానికి కూడా వెళ్లేలా వెసులుబాటు కల్పించారు. జైలుశిక్ష అనుభవిస్తున్న షరీఫ్ కు 4 వారాల పాటు మాత్రమే విదేశాల్లో ఉండేందుకు అనుమతి ఇచ్చింది.

Nawaz Sharif
Pakistan
London
  • Loading...

More Telugu News