Northern Glasiar: మంచు తుపాన్ లో చిక్కుకున్న 8 మంది భారత జవాన్లు
- నార్తర్న్ గ్లేసియర్ ను ముంచెత్తిన అవలాంచి
- సైనికుల ఆచూకీని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న సహాయ బృందం
- పహరా కాస్తున్న సమయంలో ప్రమాదం
ఉత్తర సియాచిన్ గ్లేసియర్ వద్ద సంభవించిన అవలాంచి (మంచు తుపాన్)లో ఎనిమిది మంది భారత సైనికులు చిక్కుకున్నారు. వీరు సరిహద్దుల్లో పహరా కాస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. 18వేల అడుగుల ఎత్తులో ఉన్న నార్తర్న్ గ్లేసియర్ వద్ద ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మంచు తుపాన్ వచ్చిందని సీనియర్ సైనిక అధికారి ఒకరు ప్రకటన చేశారు.
కాగా మంచు తుపాన్ లో చిక్కుకున్న సైనికులకోసం సహాయ చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. ‘సముద్ర మట్టం నుంచి 18వేల నుంచి 19 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో సైనికులు తమ విధి నిర్వహణలో భాగంగా గస్తీ నిర్వహిస్తుండగా, వారిని మంచు తుపాన్ ముంచెత్తింది. వారి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాము’ అని ఆయన చెప్పారు.